టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ… కాసేపట్లో ప్రకటించే అవకాశం…!

-

టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శ్రీలంకతో జరుగనున్న హోం సిరీస్ నుంచి రోహిత్ టెస్ట్ టీంకు కూడా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. సౌతాఫ్రికా సిరీస్ తరువాత విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే దానిపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది.

కాగా టీంమిండియాలో కెప్టెన్సీ మార్పు వ్యవహారం చిన్నపాటి దుమారానికి దారి తీసింది. విరాట్ కోహ్లీని కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించారని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. బోర్డుకు, కోహ్లీకి మధ్య చెడిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే కోహ్లీకి ,రోహిత్ శర్మకు మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ వివాదంలోకి బీసీసీఐ ఛీఫ్ గంగూలీని కూడా లాగారు. అయితే గతంలో గంగూలీ ఈ వ్యవహారం గురించి తనకేం సంబంధం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news