ఈ రోజు ఐపిఎల్ లో భాగంగా ఢిల్లీ మరియు గుజరాత్ జట్లు ఢిల్లీ వేదికగా తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఢిల్లీ విసిరిన 163 పరుగల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి వుండగానే గుజరాత్ చేదించింది. తద్వారా ఢిల్లీ క్యాపిటల్ వరుసగా రెండవ ఓటమిని మూటగట్టుకుంది. ఆఖర్లో అక్షర్ పటేల్ విజృంభణతో 162 పరుగులు చేసిన ఢిల్లీ… బౌలింగ్ లో తీరంగా ఫెయిల్ అయ్యింది. పవర్ ప్లే లో మూడు వికెట్లు తీసి గుజరాత్ ను అడ్డుకున్న ఢిల్లీ ఆ తర్వాత నాలుగవ వికెట్ ను త్వరగా పడగొట్టడంలో లేట్ చేసిన ఢిల్లీ బౌలర్లు ఆ కారణం గానే మ్యాచ్ ను కోల్పోయారు అని చెప్పాలి.
ఇక మరో విషయం ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది. జట్టులో ఆల్ రౌండర్ గా సేవలందిస్తున్న అక్షర్ పటేల్ కు మ్యాచ్ మొత్తం మీద బౌలింగ్ ఇవ్వకపోవడం మరీ ఘోరం. సుదర్శన్ మరియు విజయ్ శంకర్ లు 53 పరుగులు జోడించి మ్యాచ్ ను దెబ్బ తీశారు. ఆ దశలో అక్షర్ పటేల్ కు బౌలింగ్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వారి పార్టనర్ షిప్ ను విడగొట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ వికెట్లు తీయడంలో బాగా నేర్పరి అయిన అక్షర్ కు బౌలింగ్ ఇవ్వకపోవడం మహా దారుణం అని చెప్పాలి.