కోల్‌కతా నైట్ రైడర్ స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న మ్యాచ్ జరగాల్సింది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ పూర్తిగా రద్దు అయిపోయింది. మ్యాచ్ జరగాల్సిన అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో భారీ వర్షం కురిసింది. దీంతో కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌ను రద్దు చేశారు ఎంపైర్లు. దీంతో ఇరు జట్లకు చెరకు పాయింట్ లభించింది.
ఈ నేపథ్యంలోనే పాయింట్స్ టేబుల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ పొజిషన్‌కు చేరింది. అటు గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. తర్వాతి మ్యాచ్ హైదరాబాద్ తో గెలిచినా కూడా 13 పాయింట్లు అవుతాయి గుజరాతి జట్టుకు. దీంతో గుజరాత్ అధికారికంగా ఐపీఎల్ 2024 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన మూడవ జట్టుగా నిలిచింది.