అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..

-

అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లండ్ తరఫున ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన మొయిన్ అలీ తాజాగా వీడ్కోలు పలికారు.‘ నేను దేశం తరఫున ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడాను.ఇక మీదట యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే,అలీ గతంలో రెండు సార్లు రిటైర్మెంట్ ప్రకటించి దానిని వెనక్కి తీసుకున్నారు.

కానీ, ఈసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోనని మొయిన్ అలీ స్పష్టంచేశారు. అలీ తన కెరీర్‌లో 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. ఇక లీగుల్లో 352 మ్యాచులు ఆడాడు. మొయిన్ అలీ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఎన్నోసార్లు జట్టుకు విజయాన్ని అందించాడు. మొన్నటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగులో చెన్నయ్ సూపర్ సింగ్స్ జట్టు తరపున అభిమానులను అలరించాడు. అలీ ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచులకు వీడ్కోలు పలికిన లీగు మ్యాచుల్లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version