మెగా బ్రదర్ నాగబాబు ఒకానొక సమయంలో అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఆ టైంలో ఆయనకు తన సోదరులు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ప్రజెంట్ నాగబాబు ఓ వైపున బుల్లితెరపైన సందడి చేస్తూనే మరో వైపున పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్యారలల్ గా పాలిటిక్స్ కూడా చేస్తున్నారు. జనసేన నాయకుడిగా కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
ఈ సంగతులు పక్కనబెడితే..నాగబాబు పెళ్లి విషయమై ఆయన తల్లి అంజనాదేవి చాలా పెద్ద కథే నడిపిందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అంజనాదేవి నాగబాబు భార్య పద్మజను ఎక్కడ చూసిందంటే..ఏదో వివాహ కార్యక్రమానికి పాలకొల్లు వెళ్లిన క్రమంలో అక్కడ పద్మజను చూసిన అంజనాదేవి.. లక్షణంగా, పద్ధతిగా ఉన్న పద్మజాను చూసి ఇంప్రెస్ అయిందట. ఆ తర్వాత పద్మజా వాళ్ల ఇంటికి వెళ్లిందట.
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయిన పద్మజ..చిరంజీవికి సంబంధించిన పేపర్ కటింగ్స్ అన్నీ ఒక బుక్ లాగా చేయించుకుంది. ఆ బుక్ ను తన ఇంటికి వచ్చిన అతిథులకు చూపిస్తుంటుంది. అలా అంజనాదేవికి ఆ బుక్ చూపించగా, పద్మజా అంజనాదేవికి బాగా నచ్చిందట. అలా అంజనాదేవి నాగబాబుకు జోడిగా పద్మజాను చేయాలని అనుకుంది.
తాను పాలకొల్లులో ఓ అమ్మాయిని చూశానని అంజనాదేవి నాగబాబుకు చెప్పగా, మీకు అన్ని విధాలా నచ్చితే వచ్చి చూస్తానని నాగబాబు చెప్పాడు. అయితే, సంపన్న కుటుంబం అయిన అంజనాదేవి కుటుంబంతో సంబంధం తాము తూగుతామా? అన్ని పద్మజా కుటుంబ సభ్యులు అనుకున్నారట. కానీ, ఎప్పటికప్పుడు కబురు పంపుతూ ఎట్టకేలకు నాగబాబు, అంజనాదేవి-వెంకటరావులు వెళ్లి పద్మజాను సంబంధం ఖాయం చేసుకున్నారు. అలా చిరంజీవి వీరాభిమాని అయిన పద్మజా..నాగబాబు భార్య అయింది. నాగబాబు పెళ్లి కోసం అలా వెనుకనుండి పెద్ద కథే నడిపించింది అంజనాదేవి.