‘రాజన్న, ఆర్ఆర్ఆర్’ చిత్రాల మధ్య ఉన్న పోలికలివే..

-

ఒకప్పటితో పోల్చితే జనాల్లో సినిమాల పట్ల అవగాహన బాగా పెరిగిందని చెప్పొచ్చు. అందుకు సాంకేతికత ప్రధాన కారణం. కాగా, ప్రజల జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే. ఇటీవల కాలంలో ఏదేని చిత్రంలో ఇతర సినిమాల చిన్న సీన్ కాపీ చేసినా వెంటనే గుర్తు పట్టేసి సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేసేస్తున్నారు. తాజాగా అటువంటి ట్రోల్ కాకపోయినా కాపీ చేశారనే క్వశ్చన్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర విషయంలో వచ్చింది.

‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ మరో ‘రాజన్న’ చిత్రమని కొందరు విమర్శకులు కామెంట్స్ చేయడంతో పాటు కొన్ని సీన్లు కాపీ చేశారనే ఆరోపణలు చేశారు. ఇందుకు ప్రధాన కారణం ‘ఆర్ఆర్ఆర్, రాజన్న’ చిత్రాల స్టోరి లైన్ బేస్ ఒకేలా ఉండటం. రెండు సినిమాల్లో దేశభక్తి ఉంటుంది. ఈ రెండిటికీ విజయేందప్రసాదే స్టోరి అందించారు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ స్టోరి ఆదిలాబాద్ అడవుల్లో స్టార్టవుతుంది. అక్కడ ఉన్న గిరిజన బిడ్డ మల్లిని బ్రిటీష్ దొరసాని ఎత్తుకుపోగా, ఆమెను వెనక్కి తీసుకురావడానికి కొమురం భీం ఢిల్లీకి వెళ్లడం ఇక అక్కడి నుంచి కథ మలుపులు తిరుగుతుంది.

సేమ్ స్టోరి లైన్ ‘రాజన్న’ సినిమాలోనూ ఉంటుంది. మల్లమ్మ అనే చిన్నారితో కథ స్టార్టవుతుంది. దొరసాని నుంచి తన గ్రామాన్ని రక్షించుకోవడం కోసం రాష్ట్రపతిని కలిసేందుకు మల్లమ్మ కాలినడకన పయనమవుతుంది. అలా మల్లమ్మ చుట్టూ స్టోరి రన్ అవుతుండగా, ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ లో మల్లి కోసం హీరోలు ప్యారలల్ గా ఫైట్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ‘రాజన్న’ మూవీకి పాటల పోలిక కూడా ఉంది.

‘కొమురం భీముడో’ పాటతో ప్రజల్లో చైతన్యం నింపేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తుండగా, రాజన్న చిత్రంలో నాగార్జున పాటలు పాడి జనంలో ఉత్తేజం నింపుతారు. ఈ నేపథ్యంలోనే ‘రాజన్న’ సినిమా కథలోనుంచి ఇన్ స్పైర్ అయ్యే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని విజయేంద్రప్రసాద్ రాశారని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news