నేడు హిజాబ్ కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు

-

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హిజాబ్‌ నిషేద నిర్ణయాన్ని కొందరు ముస్లిం బాలికలు ఫిబ్రవరి 5, 2022న హైకోర్టులో సవాలు చేశారు. అయితే.. కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా తీర్పు వెలువరించడంతో.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరు పక్షాలు సుప్రీంకోర్టులో తమ వాదనను వినిపించాయి. ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టు తీర్పుపైనే ఉంది. ఈ నేపథ్యంలో.. హిజాబ్‌ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. హిజాబ్‌ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 10 రోజులపాటు సుప్రీంకోర్టు విచారించింది. గత నెల 22న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. దీనికి సంబంధించిన తీర్పును జస్టిస్‌ హేమంత్‌గుప్తా, సుధాన్షు ధులియా ధర్మాసనం వెల్లడించనుంది.

Student moves Supreme Court against Karnataka HC's hijab verdict | The News  Minute

ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించనుంది. పాఠశాలలు, కళాశాలల్లో యూనిఫారాన్ని పూర్తిగా పాటించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని హైకోర్టు పేర్కొంది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు మతస్వేచ్ఛ హక్కు కోసం వాదించగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ పాఠశాల-కళాశాలల్లో క్రమశిక్షణ పాటించాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news