UNION CABINET : రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం

-

రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి రామ్ నాథ్  కోవింద్ ఆధ్వర్యంలో కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో… కేంద్రమంత్రిగా నారాయణ రానే మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సోనోవాల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి గా వీరేంద్ర కుమార్ ప్రమాణస్వీకారం చేయగా…. నాలుగో వ్యక్తిగా జ్యోతిరాదిత్య సిందియా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా వరుసగా కొత్త కేంద్ర మంత్రులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇవాళ ఉదయం నుంచి కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తీవ్ర ఉత్కంఠతను రేపిన సంగతి తెలిసిందే. అందరూ అనుకున్నట్లుగానే కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రి పదవులకు సంతోష్‌ గాంగ్వర్‌, రమేశ్‌ ఫోక్రియాల్‌ తో సహా సదానంద గౌడ్‌ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో మంత్రి వదవికి రమేష్‌ ఫోఖ్రియాల్‌ రాజీనామా చేశారు. అలాగే కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో సహా రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version