వయసు పెరిగే కొద్దీ ఎముకల ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ప్రయత్నం చేయండి. డైట్ లో వీటిని తీసుకుంటే కచ్చితంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
మనం తీసుకునే ఆహారం, చెడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమీ, వ్యాయామం, ఒత్తిడి వలన ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే వీటిని డైట్ లో చేర్చుకోండి.
నువ్వులు:
నువ్వులు ఆరోగ్యానికి మంచిది అలానే ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి పోషక పదార్థాలతో నిండి ఉంటాయి నువ్వులు.
పప్పులు:
డైట్ లో పప్పులను తీసుకుంటే కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ బీన్స్, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు వీటన్నిటిని కూడా డైట్లో తీసుకుంటూ ఉండండి.
క్యారెట్, పాలకూర జ్యూస్:
క్యారెట్ పాలకూర జ్యూస్ ని కూడా డైట్లో తీసుకోండి. ఇది కూడా మీ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వీటిలో అధికంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండడానికి అవుతుంది.
ఆకుకూరలు:
ఆకుకూరలు ని కూడా డైట్లో చేర్చుకుంటూ ఉండండి ఆకుకూరలను తీసుకుంటే కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
రాగులు:
రాగులలో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పిల్లలు మొదలు వృద్ధులు దాకా రాగులు తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు. అలానే అంజీర్, బ్రోకలీ, తృణధాన్యాలని కూడా డైట్ లో తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.