Tamilnadu:దేశంలోనే తొలిసారిగా మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్

-

తమిళనాడులో సంక్రాంతికి జరిగే ఎద్దుల పోటీలు ఎంత ఫేమస్ అనేది చాలామందికి తెలుసు.ఆ ఎద్దుల పొట్టీలనే జల్లికట్టు అని అంటారు. ఈ జల్లికట్టు  అనేది తమిళ ప్రజలకు సంప్రాదయ కీడ.  సంక్రాంతికి ప్రారంభమైన ఈ జల్లికట్టు పోటీలు దాదాపు నెల రోజులపాటు జరుగుతాయి.వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకగా చెప్పుకునే ఎంతో ప్రసిద్ధమైన జల్లికట్టు పోటీల కోసం యావత్ తమిళనాడు ప్రజలు సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటారు.

తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని  ప్రారంభించారు. ఈ స్టేడియానికి మాజీ సీఎం, దివంగత డీఎంకే నేత ఎం.కరుణానిధి పేరు పెట్టారు.జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన ఈ స్టేడియంలో తొలిసారిగా ఆరువందల ఎద్దులు పోటీలకు సిద్ధమయ్యాయి. నాలుగు వందలమంది యువకులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రూ.44 కోట్ల అంచనా వ్యయంతో 5 వేల మందికి పైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి జల్లికట్టు స్టేడియాన్ని నిర్మించారు.ఈ స్టేడియంలో ఆటగాళ్లు, ప్రేక్షకులు, మీడియాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.  వీఐపీ సీటింగ్, మ్యూజియం, ఆరోగ్య సహాయక కేంద్రాలు, వెటర్నరీ డిస్పెన్సరీ,బుల్ షెడ్ ఈ స్టేడియంలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version