ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు చేసిన వన్ సైడ్ లవ్ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో టిడిపి మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే ఆలోచనలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు తాము పొత్తు పెట్టుకోనున్నట్లు ఏ పార్టీ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అటు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ పొత్తులో ఉంది. ఈ విషయాన్ని రెండు పార్టీలు బహిరంగంగానే ప్రకటించాయి.
వచ్చే ఎన్నికల్లోనూ తాము పొత్తు పెట్టుకుంటామని సోము వీర్రాజు కూడా పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో… జనసేన- టిడిపి పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆయన వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లాయి. కానీ అప్పుడు రెండు పార్టీలకు పరాభవం తప్పలేదు. మరి ఈసారి కూడా పొత్తు పెట్టుకోవాలా. ,? లేదా అనే సందిగ్ధంలో రెండు పార్టీలు ఉన్నాయి. జనసేన ఒంటరిగా వెళ్తే వైసీపీని ఎదుర్కోవడం చాలా కష్టం.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ని ఓడించాలంటే ఏపీ లోని అన్ని ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే… ఆ దిశగా రెండు పార్టీలు అడుగులు వేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. దీనిపై ఇవాళ జరిగే జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్.. ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.