మాధవ్‌..! నీ సుందర ప్రతిబింబం చూడాల్సిన అవసరం నాకేం ఉంటుంది :చింతకాయల విజయ్

-

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఎంపీ మాధవ్‌ ఈ వీడియో గురించి టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌పై ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో చింతకాయల విజయ్‌ స్పందిస్తూ.. ఎంపీ మాధవ్‌ న్యూడ్‌ వీడియోకు.. నాకు ఏం సంబంధం..? టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాకు.. నీ పర్సనల్‌ వీడియోతో ఏం సంబంధం. ఎంపీగా ఉన్న మాధవ్‌ పార్లమెంటుకు.. ఓటేసిన ప్రజలకు.. కుటుంబానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మాధవ్‌.. ఆ వీడియో ఫోరెన్సిక్‌ ఇవ్వు.. వాస్తవాలెంటో తెలుస్తాయి. మాధవ్‌..! నీ సుందర ప్రతిబింబం చూడాల్సిన అవసరం నాకేం ఉంటుంది. నీ సుందర ప్రతిబింబాన్ని చూడడానికి ఎవరికి గుండెలు సరిపోవు. జిమ్‌లో ఏదో చేశానంటూ వీడియో చూపించారు.. మేం బతికి ఉంది ఇందుకేనా..? మాధవ్‌ వీడియో చూసిన ప్రజలు ఏమైపోయారోనని ఆందోళనగా ఉంది.

Former minister ayyannapartrudu son behaviour makes controversy | NewsTrack  English 1

ఇలాంటి వీడియోలను ఎవరైనా మార్ఫ్‌ చేస్తారా..? మాధవ్‌ మీద నేను పరువు నష్టం దావా వేస్తా. మాధవ్‌ మీద పార్లమెంట్‌ సెక్రటేరీయేట్‌లో ఫిర్యాదు చేస్తా.ఏపీ సమస్యల గురించి పార్లమెంట్‌లో మాట్లాడ్డానికి మాధవ్‌ను ఎంపీ చేస్తే.. సిగ్గు లేకుండా బట్టలిప్పి వీడియోలు వదులుతారా..? నీ వీడియో మార్ఫ్‌ చేయడానికి నువ్వేమన్నా టామ్‌ క్రూజ్‌వా..? జిమ్‌ చేస్తోంటే వీడియోలు తీయడానికి నువ్వేమైనా హలివుడ్‌ యాక్టరువా..? మేం బతికుంది నీ నగ్న వీడియోలు చూడడానికా..? ఉదయాన్నే వాట్సాప్‌లో మాకేంటీ రచ్చ. సీఎం జగన్‌ ఎంపీ మాధవ్‌ను సస్పెండ్‌ చేయాలి. మీసం తిప్పావని.. తొడగొట్టావని జగన్‌ టిక్కెట్‌ ఇచ్చారు.. నువ్వు ఎంపీ అయ్యావు. లైవుల్లో కూర్చొని ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి కానీ.. ఈ వీడియోలేంటీ..? ఈ రోజు వరకు మాధవ్‌ ఎవడో ఏంటో తెలీదు.

మాధవ్‌ మీద కేసులున్నాయని నేషనల్‌ మీడియాలో స్పష్టంగా చెప్పారు. మాధవ్ బేషరతుగా రాజీనామా చేయాలి. ఈ వీడియో తనది కాదని ప్రూవ్‌ అయితేనే మళ్లీ రాజకీయాల్లోకి రావాలి. ఆ వీడియోను ఇంకొంత సేపు చూస్తే.. నాకు ఆరోగ్య సమస్యలు వచ్చేలా ఉంది. వైసీపీ రాసలీలల పార్టీగా మారింది. నువ్వేం తోపు కాదు.. నిన్ను చూస్తేనే ఏపీ ప్రజలకు కంపరం పుడుతోంది. మాధవ్..! నీ వీడియో మార్ఫింగ్‌ చేయడానికి టెక్నాలజీ మీద పెట్టే డబ్బు కూడా దండగ.. ఆ విషయం తెలుసుకో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పస

 

Read more RELATED
Recommended to you

Latest news