సీఐడీ ఏడీజీకి టీడీపీ పార్టీ బహిరంగ లేఖ

-

సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నర్ల రామయ్య లేఖ రాసింది. సీఐడీ పోలీసులు చట్టపరమైన బాధ్యతలను మరిచారని.. సీఐడీ పోలీసులు సీఏం జగన్ వ్యక్తిగత సైన్యంలా కాకుండా రాజ్యాంగం ప్రకారం పని చేసేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. జూన్ 29 రాత్రి సీఐడీ పోలీసులు సంఘ విద్రోహుల్లా గోడ దూకి తలుపులు పగులగొట్టి అక్రమంగా గార్లపాటి వెనక్టేశ్వరరావును అరెస్టు చేశారని.. జూన్ 30 ఉదయం మోకరాల సాంబశివరావును మంగళగిరిలోని అతని ఇంటి నుండి బలవంతంగా అరెస్టు చేశారని లేఖలో వివరించారు.

అరెస్టు తర్వాత బాధితులను బలవంతంగా నగ్నంగా మార్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్‌ విజయమ్మ తన పదవికి రాజీనామా చేసిందనే పోస్ట్‌లను ఆన్‌లైన్‌లో షేర్ చేశారనే ఆరోపణలతో కేసులు నమోదు చేసి అక్రమ అరెస్టులు చేశారన్నారు. ఆరోపించిన పోస్ట్‌ లలో పేర్కొన్నట్లుగా వైఎస్ విజయమ్మ జూలై 8న జరిగిన వైసీపీ ప్లీనరీలో తన పదవికి రాజీనామా చేశారని.. ఫిర్యాదులను క్షుణ్ణంగా విచారించకుండా, ఆరోపించిన పోస్ట్ అసలు సృష్టికర్తను కనుగొనకుండా, సీఐడీ ఒక అజ్ఞానిలా వ్యవహరించిందని తెలిపారు.

బాధితులను శారీరక వేధింపులకు గురిచేయడమే కాకుండా బంధువులు, గ్రామస్థుల మధ్య అవమానపడేలా మానసిక వేధింపులకు గురిచేసింది… వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ వ్యక్తిగత సైన్యంలా సీఐడీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఐడీ చట్టపరమైన రాజ్యాంగ బాధ్యతలను మరిచి సీఎం జగన్ కోరిక మేరకు పనిచేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని.. సీఐడీ తన విధులను రాజ్యాంగం ప్రకారం, ఏపీ పోలీసు మాన్యువల్లో నిర్దేశించిన ప్రకారం పనిచేసేలా చర్యలు తీసుకోండని డిమాండ్‌ చేశారు వర్ల రామయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version