కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు

-

గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసిపి బీభత్సం సృష్టించింది.ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది.వైఎస్ జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో టిడిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలు విధ్వంసంలు సృష్టిస్తున్నారు.

మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు గుడివాడలోని ఆయన ఇంటి వద్ద హల్ చల్ చేశాయి. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసురుతూ ‘దమ్ముంటే బయటకి రా’ అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. ‘పోలీసులు లేకపోతే నీది కుక్క బతుకు. బయటకు రా.. లోకేశ్ ఆధ్వర్యంలో నీకు అంకుశం సినిమా చూపిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version