బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులలతో పాటు జాతీయ నాయకులు హైదరాబాద్‌లో బస చేయనున్నారు. అయితే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న అతిథులకు ఇక్కడి వంటకాలు ఎప్పటికీ గుర్తుండుపోయేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ శ్రేణులు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రత్యేక వంటకాలతో మెనూ సిద్ధమైంది. హైదరాబాద్ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రత్యేక వంటకాలు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల ప్రసిద్ధ వంటకాలు ఈ మెనూలో ఉన్నాయి. 60 రకాల కూరలు, 40 రకాల స్వీట్లతో పాటు ఉదయం అల్పాహారంలో 20 రకాలను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు.
చామగడ్డ ఫ్రై, లాల్‌మార్ట్‌కీ సబ్జి, చిక్కుడుకాయ టమోటా కూర, ఆలుగడ్డ కూర, వంకాయ మసాల, దొండకాయ కొకొనట్ ఫ్రై, బెండకాయ- కాజూ పల్లి ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్‌మేకర్ కర్రీతోపాటు ఉత్తర, దక్షిణ భారత వంటకాలు వండుతున్నారు. స్వీట్ల జాబితాలో డబుల్‌కా మీఠా, ఖుబానీకా మీఠా, రెడ్ వెల్వెట్ రస్ మలాయ్, నువ్వుల లడ్డూలు, పరమాన్నం, సేమియా పాయసం, భక్ష్యాలు, అరిసెలు ఉన్నాయి. అయితే ఈ వంటలకు ఇంచార్జీగా యాదమ్మ వ్యవహరించడం విశేషం.