అవినాశ్‌ రెడ్డిని ఏడు గంటలు విచారించిన సీబీఐ

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. అవినాశ్ రెడ్డిని ఇటీవల అరెస్ట్ చేసిన సీబీఐ రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులపై వెంటనే విడుదల చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాలి.

CBI Now Free To Arrest MP YS Avinash Reddy

ఈ నేపథ్యంలోనే ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7 గంటల పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. ఏడు గంటల విచారణలో సీబీఐ పలు విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. వాట్సప్ కాల్స్, రూ.4 కోట్ల ఫండింగ్పై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అప్రూవర్ దస్తగిరిని ప్రలోభాలకు గురిచేయడంపై ప్రశ్నించినట్లు కీలక సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news