Bhagyanagar Express: తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే ప్రయాణికులకు… బిగ్ అలర్ట్. రేపటి నుంచి భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ బంద్ కానుంది. దాదాపు 11 రోజుల పాటు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్.. బంద్ కాబోతున్నట్లు రైల్వే శాఖ ప్రకటన చేసింది. ఈ భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సేవలను ఉత్తర తెలంగాణ వాసులు.. బాగా వాడతారు. మూడవ లైన్ పనుల కారణంతో సికింద్రాబాద్ కాగజ్నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈనెల 10వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు రద్దు చేయబోతున్నారు.
అంటే దాదాపు 11 రోజులపాటు ఈ భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు… సేవలు ఆగిపోనున్నాయి. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్ జమ్మికుంట పాత్కపల్లి పెద్దపల్లి రామగుండం మంచిర్యాల కాగజ్నగర్ వరకు దీనిలో నిత్యం ఉత్తర తెలంగాణ వాసులు మాత్రమే ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు కూడా హైదరాబాద్ వచ్చేందుకు ఈ ట్రైన్ వాడుతారు.