బిజెపి – బిఆర్ఎస్ రెండు తోడు దొంగలే – భట్టి విక్రమార్క

-

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా ప్రజలను అభ్యంగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు బట్టి. పాదయాత్ర ఇంద్రవెల్లి మండలం కుమ్మరి తండాకు చేరుకున్నాక అక్కడ మీడియాతో మాట్లాడారు బట్టి విక్రమార్క. బిజెపి – బిఆర్ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి – బిఆర్ఎస్ రెండు తోడుదొంగలేనని అన్నారు.

ఆ రెండు కలిసి కాంగ్రెస్ ని కార్నర్ చేయాలని చూస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆరోపించారు. ధరణి వల్ల ఎక్కువగా పేద రైతులే నష్టపోయారని అన్నారు. ధరణి వెబ్సైట్ వల్ల రాష్ట్రంలో తిరిగి ఫ్యూడలిజం వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిలో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి తమ పాదయాత్ర అని అన్నారు బట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news