పేపర్ లీకేజీలతో బిజెపి నీచమైన రాజకీయాలకు తెరలేపింది – కడియం శ్రీహరి

-

తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడుగడుగునా అడ్డుకుంటుందని.. అయిన తెలంగాణకు జాతీయ అవార్డులు ఇవ్వక తప్పడం లేదన్నారు మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో బిజెపి కార్యకర్తలు మాత్రమే పాల్గొన్నారన్నారు. ఆ సభలో తెలంగాణ పై విషం కక్కే విధంగా ప్రధాని మాట్లాడారని ఆరోపించారు కడియం. భారతదేశంలో తెలంగాణ లేదా? అభివృద్ధి చెందితే సంతోషించాల్సింది పోయి, అంత అక్కసు ఎందకు? అని నిలదీశారు.

నిరుద్యోగుల మార్చ్ వరంగల్ లో నిర్వహించడం విడ్డూరంగా అనిస్తుందన్నారు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు మోడీ ఒరగబెట్టింది ఏంటి.? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనలో తెలంగాణకు ఇచ్చి హామీలను ఒక్కసారైనా ప్రధాని పరిశీలించారా..? అని దుయ్యబట్టారు కడియం. తెలంగాణ విభజన హామీలో పొందుపర్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ ఏందకు ఏర్పాటు చేయలేదన్నారు. విభజన హామీల మీద ఇప్పటివరకు ఉలుకుపలుకు లేదన్నారు. కేంద్ర క్యాబినేట్ లో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కాబినెట్ లో ఉండి విభజన హామీలపై లెవనెత్తా కుండా నిద్రపోతున్నాడా అని మండిపడ్డారు.

కేంద్ర క్యాబినెట్ లో మంత్రి ఉన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ విభజన హామీలపై హామీ ఇప్పించలేకపోవడం తెలంగాణకు ద్రోహం చేయడమేనన్నారు. అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ తొమ్మిదేళ్ల అధికారంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి విభజన హామీలు,నిరుద్యోగ హామీలు అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకొని వరంగల్ లో మిలియన్ మార్చ్ చేస్తారని ప్రశ్నించారు కడియం. బిజెపి పేపర్ లీకేజీలతో నీచమైన రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సి పేపర్ లీకేజీలో బిజెపి కార్యకర్తలే ప్రధానంగా ఉన్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version