మల్లారెడ్డి నివాసంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికపై చర్చించారు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం కలిసి కట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
మల్లారెడ్డి నాయకత్వంలో రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కాగా, తాను వేరే పార్టీలో చేరేది లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. గతంలో రేవంత్ రెడ్డిపై తొడ గొట్టి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ పరంగానే చేసినవేనని.. వ్యక్తిగతంగా కాదని తెలిపారు. తామంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో స్నేహంగా మెలిగేవారమని చెప్పుకొచ్చారు. తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని, అతను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పారు.