ఆరు నూరైనా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎసే : సీఎం కేసీఆర్

-

ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువకుండా ఎవడూ ఆపలేడన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

ఇవాళ ‘ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు కరటక దమ్మదగ్గులున్నరు. బీఆర్‌ఎస్‌ తరఫున నిలబడ్డ ఎవన్ని కూడా నేను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యనని ఒకడంటడు. అది అయ్యేపనేనా..? మీరంతా తలుచుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంలో దుమ్మురేగదా..? సండ్ర వెంకట వీరయ్య ఒక్కసారి కాదు, నాలుగోసారి సత్తుపల్లి పహిల్వాన్‌లా శాసనసభలో అడుగుపెట్టడా..? నామా నాగేశ్వర్‌రావు ఖమ్మం పహిల్వాన్‌లా లోక్‌సభలో అడుగుపెట్టడా..? ఒక్కొక్కనికి ఎంత అహంకారం. నాలుగు పైసలు జేబులో పడితే ఇంత అహంకారం పెరుగుతదా..? పదేళ్లు సీఎంగా పని చేసిన నేను కూడా అంత అహంకారంతోటి మాట్లాడలేదు’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version