కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చింది : ప్రొఫెసర్ కోదండరామ్

-

సిద్ధిపేటలో TJAC ఛైర్మన్ కోదండరాం పర్యటించారు. ఈ సందర్భంగా కోదండ రాం  మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చింది.  పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తమ మద్దతు ఉంటుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ సమస్యలతో కూడుకున్నది దానిపై లోతైన సమీక్షా జరగాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కెపాసిటీ 8టీఎంసీ లు ఉంటే సరిపోతుంది అని గతంలోనే సుచించాం.

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పై పూర్తి విచారణ జరిపి ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రాజెక్ట్ నిర్వాసితులకు రావాల్సిన పూర్తి ప్యాకేజ్ రాలేదు దానిని వెంటనే ఇవ్వాలి. గత ప్రభుత్వ హయాంలో రైతులకు నష్టం జరిగిందని తెలిపారు. కొంత మందికి మేలు జరిగినప్పటికీ చాలా మంది రైతులకు కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని.. అలా ఎదురైనటువంటి ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version