హైదరాబాద్ లో పెరుగుతున్న సైబర్ మోసాలు..!

-

అమెరికాలో వీట్స్ బిజినెస్ పేరుతో సైబర్ మోసంకు పాల్పడ్డారు నిందితులు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి 2.1 కోట్లు కాజేశారు చీటర్స్. హైద్రాబాద్ కి చెందిన ఓ బాధితుడికి సైబర్ కేటుగాళ్ళు భారీగా మోసం చేశారు. అమెరికాలో చిరు ధాన్యల కంపెనీలో వ్యాపారం చేస్తూ అధిక లాభాలు వస్తాయని నమ్మించి విడతల వారిగా ఆన్లైన్ ద్వారా 2.1 కోట్ల రూపాయలు కాజేశారు చీటర్స్. అనంతరం వారు స్పందించకపోవడం, వారు చెప్పిన కంపెనీ ఫెక్ అని తేలడంతో మోసపోయానని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫియార్థులు చేసారు బాధితులు.

అదే విధంగా డ్రగ్స్ పార్సెల్ చేస్తున్నారంటు కూడా సైబర్ మోసాలకు పాల్పడ్డారు నిందితులు. ఫెడెక్స్ కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ పార్సల్ చేస్తున్నారంటు సైబర్ మోసాలు చేసారు. మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయని, CBI అధికారుల పేరుతో కేసులు నమోదు అయ్యాయని బెదిరింపులకు పాల్పడ్డారు. గత నాలుగు రోజుల్లో నలుగురు వ్యక్తుల నుండి 2.93 కోట్ల కాజేశారు సైబర్ కేటుగాళ్ళు. విషయం తెలుసుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదులు చేయడంతో.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version