బిజెపి అంటే ఏక్నాద్ షిండేలా తయారీ సంస్థనా?- సీఎం కేసీఆర్

బీజేపీ అంటే ఏక్నాథ్ షిండేల తయారీ సంస్థల అంటూ మండిపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని బిజెపి జలగలా పట్టిపీడిస్తోంది అంటూ మండిపడ్డారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టి చెప్పింది ఏమీ లేదని, ప్రధానమంత్రి ఏమి మాట్లాడారో ఆయనకే తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..

” ప్రధానమంత్రిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. లక్షల కోట్ల అవినీతి, అసంబద్ద విధానాలపై అడుగుతున్నా ఎవరు ఆన్సర్ చెప్పలేదు. వారికి సరుకూ లేదు.. సబ్జెక్టు లేదు. బబ్రజా మానం.. భజగోవిందం. వాళ్లు తెలంగాణకు చేసింది ఏమీ లేదు. రూపాయి విలువ ఎందుకు పతనం అవుతుందో మోడీ చెప్పాలి. రూపాయి విలువ దారుణంగా పతనం కావడానికి కారణం అవివేకమా? చేతగాని తనమా? అనేది ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలి”. అని సీఎం కేసీఆర్ అన్నారు.