రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్లే… అధికారులకు దెబ్బలు : కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన.. అధికారులపై దాడులపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవ్వాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే తిరగబడ్డారు రైతులు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరం. నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల, అవగాహనారాహిత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించింది.

భూసేకరణ పూర్తయ్యి, అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి, రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ అలోచన వల్లనే ఇంత అలజడి రేగింది. ఫార్మా సిటీకోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ముచేసుకుందామన్న రేవంత్ కుత్సిత బుద్ధి వల్ల ఇప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడింది, అక్కడ కొడంగల్‌లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం, చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోంది. అది ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుంది!

Read more RELATED
Recommended to you

Exit mobile version