అమిత్‌ షా సభ సక్సెస్ చేసి.. కేసీఆర్ చెంప చెల్లుమనిపిస్తాం-ఈటల రాజేందర్

అమిత్‌ షా సభ సక్సెస్ చేసి.. కేసీఆర్ చెంప చెల్లుమనిపిస్తామని హెచ్చరించారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తుక్కు గూడలో రేపు జరిగే అమిత్ షా సభ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.

etala
etala

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆగ్రహించారు. కుట్రతో, కుటిల నీతితో పాలన కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్ సంగ్రామ యాత్ర చేపట్టారని.. రేపు జరిగే సభను సక్సెస్ చేసి.. కెసిఆర్ చెంప ను చెల్లుమనిపిస్తామని హెచ్చరించారు.

ప్రధాని అని కూడా చూడకుండా తులనాడు తున్నారన్నారు. పిచ్చి లేచినట్టు మాట్లాడుతున్నారని వెల్లడించారు ఈటల రాజేందర్.కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని అమిత్ షా పిలుపు ఇవ్వబోతున్నారు…సంజయ్ యాత్రకు భారీ స్పందన వస్తుందని తెలిపారు. TRS ప్రభుత్వం రైతులకు మేమే అన్ని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న దని.. వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీప్పి కొట్టాం…. రైతులకు వాస్తవాలు చెప్పామని వెల్లడించారు. రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం తప్పేమీ లేదని పేర్కొన్నారు.