దమ్ముంటే రాజీనామా చేసి కడియం శ్రీహరి గెలవాలని సవాల్ విసిరారు తాటికొండ రాజయ్య. దేవాదుల సృష్టికర్త అని చెప్పుకునే కడియం శ్రీహరి…దొంగగా మారి 2008 లో నీటిని విడుదల చేసే లాకును నీటిలో వేయడం జరిగిందన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం.. స్టేషన్ ఘనపూర్ కు చేసిన అభివృద్ది గుండు సున్నాఅని ఫైర్ అయ్యారు. గత పది ఏళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప , కడియం శ్రీహరి కొత్తగా చేసింది ఏమీ లేదని విమర్శలు చేశారు.
నైతిక విలువలు, అభివృద్ధి అంటున్న కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా..హైకోర్టు బెంచ్ కి, సుప్రీం కోర్టు కు వెళ్త అనడం సిగ్గుచేటన్నారు. ఆనాడు తెలంగాణ ఆకాంక్ష కొరకు ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచానని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిని రాళ్ళతో, కోడిగుడ్లతో కొట్టండని రేవంత్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు..ప్రజలను హింసించే పాలన అని విమర్శలు చేశారు.