సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ రాసారు. జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయిస్తారా.. చిత్తశుద్ధి ఉంటే ఇళ్లను నిర్మించి ఇవ్వండి.. దసరాకు జర్నలిస్టుల కుటుంబాల్లో పండగ లేకుండా చేస్తారా అంటూ అడిగారు.
అయితే కరీంనగర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా.. ఇళ్ల స్థలాలు ఇప్పించి వాటిని నిర్మించే వరకు వారి పక్షాన పోరాడుతా అని పేర్కొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్పందించండి.. కరీంనగర్ జర్నలిస్టులకు న్యాయం చేయండి.. జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకుంటారా.. బతుకమ్మ పండుగకు ముందు జర్నలిస్టుల బతుకులతో ఆటలా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని ప్రశ్నించిన ఆయన… కరీంనగర్ జర్నలిస్టులు ఏమీ అన్యాయం చేశారు అంటూ పేర్కొన్నారు మాజీ మంత్రి.