బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

-

బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. బంగారం ధ‌రలు నేడు త‌గ్గాయి. అలాగే నేడు వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు.. ఒక్క రోజు త‌గ్గ‌తూ, మ‌రో రోజు పెరుగుతూ ఉంటున్నాయి. సోమ‌వారం పెరిగిన బంగారం ధ‌ర‌లు నేడు త‌గ్గాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం.. 22 క్యారెట్ల‌పై రూ. 150 త‌గ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 320 త‌గ్గింది. సోమ వారం బంగారం ధ‌ర రూ. 150 వ‌ర‌కు పెరిగింది.

అలాగే వెండి ధ‌రలు కూడా ఒక్క రోజు త‌గ్గ‌డం, మ‌రో రోజు పెర‌గ‌డం జ‌రుగుతుంది. ఈ రోజు స్వ‌ల్పంగా పెరిగిన వెండి ధ‌ర‌లు.. సోమ‌వారం ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీనికి ముందు ఆదివారం రూ. 400 వ‌ర‌కు త‌గ్గింది. కాగ నేడు కిలో గ్రాము వెండిపై రూ. 100 పెరిగింది.

తెలంగాణ లోని హైద‌రాబాద్, ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ నగ‌రాల్లో నేటి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 12 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 47,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 52,140 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 71,400 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news