BREAKING: కాంగ్రెస్ లో చేరారు గుత్తా అమిత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు గుత్తా అమిత్. జూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి గుత్తా అమిత్ ను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.
కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడే ఈ గుత్తా అమిత్. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వీడటంతో గుత్తా సుఖేందర్ కూడా కారు దిగడం ఖాయమనే మాట వినిపిస్తోంది.