VIDEO: హైదరాబాద్ లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన వాహనదారుడు..

-

భారీ వర్షాలకు ఓ ద్విచక్ర వాహనదారుడు.. వరదలో కొట్టుకుపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లోని రాంనగర్‌లో భారీ వర్షాలకు వరదలో ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయింది. అయితే అతన్ని కొంత మంది యువకులు… కాపాడారు.

Hyderabad – A two-wheeler rider was swept away by the flood due to heavy rains in Ramnagar

ఇక అటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వానతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద చేరి చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, మలక్‌పేట, ఖైరతాబాద్‌, నాగారం, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరిలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version