దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు అన్నారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార్ కేంద్రానికి ఆయన శంకు స్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రాడార్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి చేసిన కృషి ప్రసంశనీయం అన్నారు. అనాది నుంచి తెలంగాణ ప్రజలు కష్టజీవులు అన్నారు. అబ్దుల్ జయంతి నాడు ఈ రాడార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరగడం హర్షించదగ్గ విషయం అన్నారు.
రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్ కి మంచి పేరు ఉంది అన్నారు. దేశ భద్రతలో రాడార్ స్టేషన్ కీలకం అన్నారు. కమ్యూనికేషన్ రంగంలో టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతోంది అన్నారు. రాజకీయాలు వేరు.. దేశ భద్రత వేరు అన్నారు. తపాలా వ్యవస్థను అనేక ఏళ్లుగా వినియోగించుకున్నాం. ప్రస్తుతం ఇంట్లో కూర్చునే అనేక కోర్సులు నేర్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.