పదవీలో ఉండి అలా మాట్లాడటం సరికాదు.. కేంద్రమంత్రి పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

-

రాష్ట్రాల హక్కులను హరించే అధికారం కేంద్రానికి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్ లో భారత రాజ్యాంగం పై తెలంగాణ జాగృతి  ఆధ్వర్యంలో
నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న ఆమె.. కేంద్ర మంత్రి బండి సంజయ్  వ్యాఖ్యలపై స్పందించారు. కవిత మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమని బండి సంజయ్ అన్నారని, ప్రతిష్టాత్మకమైన పదవిలో ఉండి ఈ వ్యాఖ్యలు సరికాదన్నారు.

ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనితీరు ఉందని ఆరోపించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. కింది స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని, కానీ బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అని ఎలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదని కవిత స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version