బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామని జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి విషయంలో బీజేపీ జాతీయ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల మధ్య సమన్వయ లోపం నెలకొంది. కొద్దిరోజుల క్రితం ధరణి రద్దు చేయం, దానిని కొనసాగిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.
దీనికి పూర్తి భిన్నంగా నిన్న ఆదివారం నాగర్‌కర్నూలులో బీజేపీ నిర్వహించిన నవ సంకల్ప సభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇక నడ్డా మాట్లాడుతూ, కమల వికాసంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు మాత్రమే సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు దుఃఖంలో మునిగిపోయారని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో పేదరికం 10 శాతానికి తగ్గిపోయిందని నాగర్కర్నూల్ సభలో నడ్డా తెలిపారు.