రాజకీయ వ్యాఖ్యలు చేయాలంటే కోర్టు నిబంధనలు అడ్డువస్తున్నాయన్నారు పాడి కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా తనను అరెస్ట్ చేయించాడని ఆగ్రహించారు పాడి కౌశిక్ రెడ్డి. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కరీంనగర్ లో పాడి కౌశిక్ రెడ్డి.. మాట్లాడారు. కరీంనగర్ పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. రేపు హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు పాడి కౌశిక్ రెడ్డి.
పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకున్నా… నిన్న రాత్రి నుంచి నాకు మద్దతుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు చెప్పారు పాడి కౌశిక్ రెడ్డి. ఇది ఇలా ఉండగా… బీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. బీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కోర్టు తీర్పు ఇచ్చింది. నిన్న బీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి.. ఇవాళ కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇక కోర్టులో పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది.