ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో ముగియనుంది కవిత జ్యుడీషియల్ రిమాండ్.
రౌస్ ఎవిన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్నారు తీహార్ జైలు అధికారులు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న ఈడి, ఏప్రిల్ 11 న సీబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు. ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు.. కోర్టులో ఈడి న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని…శ్రీనివాసులు రెడ్డిని కేసీఆర్ పేరుకు అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు.