మునుగోడు ఫలితం వచ్చాక కేసీఆర్ కుటుంబం విమానంలో పారిపోవాల్సిందే – రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాక కెసిఆర్ కుటుంబం అంతా విమానంలో పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయకుంటే మునుగోడు గురించి మాట్లాడే వారే కాదని.. తన రాజీనామా తోనే మునుగోడుకు ప్రభుత్వం కదిలి వచ్చిందని అన్నారు.

పింఛన్ రాదేమోనని భయపడే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దని జనానికిి సూచించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇతర పార్టీల వారిని బెదిరిస్తూ తమ పార్టీ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో తనను ఓడించాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు ఇంత సైన్యం ఎందుకనిి ప్రశ్నించారు. ఓటర్లు ఇచ్చే తీర్పు మీదే మునుగోడు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.