మాజీ సర్పంచుల అరెస్టు…రంగంలోకి KTR, హరీష్ రావు

-

మాజీ సర్పంచుల అరెస్టు తరుణంలో…రంగంలోకి KTR, హరీష్ రావు దిగారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది- పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు.

KTR to the house of Harish Rao and Kaushik Reddy

తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారని చెప్పారు. సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా ? అని నిలదీశారు. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్య క్రమాననికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. అటు హరీష్ రావు కూడా దీనిపై స్పందించారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని ట్వీట్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version