తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని స్కూళ్లలో లైబ్రరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
5 వేల ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూల్లలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమికోన్నత పాఠశాలలతో సహా 2,732 ఉన్నత స్కూళ్లలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఒక్కో లైబ్రరీకి 120 పుస్తకాలు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి ఈ పుస్తకాలను విద్యాశాఖ కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. కొనుగోలు చేసిన తర్వాత అన్ని స్కూళ్లలో ఏర్పాటు కానున్న లైబ్రరీలకు తరలించనుంది.