ఫోర్జరీ సంతకాలు చేసి ప్రభుత్వ స్టాంపులను తయారు చేస్తున్న ముఠాను వరంగల్ లో మట్టేవాడ పోలీసులు అరెస్టు చేసారు. ఈ క్రమంలోనే వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్. వరంగల్ తహసిల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన లో పోలీసులు లోతువిచారణ చేపట్టి అనేక రకాల ఆధారాలను వెలికి తీశారు.
ప్రభుత్వ అధికారుల సంతకాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల ముద్రలను సైతం తయారీకి పాల్పడి నేరాలు చేసినట్లుగా రుజువులు సేకరించిన పోలీసులు.. ఈ నేరానికి పాల్పడిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులు పస్తం సతీష్, జూలూరి చక్రపాణి, గోవింద్ సతీష్, మహమ్మద్ అజారుద్దీన్, సయ్యద్ సాబీర్, మాకుల దామోదర్, కాసెట్టి కమలాకర్, సముద్రాల కిరణ్ కుమార్ లను అదుపులోకి తీసుకొని విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు తెలిపారు వరంగల్ ఏసిపి నందిరాం నాయక్..