కేసీఆర్ అలా చేస్తే.. ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లి పోతా – వైఎస్ షర్మిల

దమ్ముంటే దళితున్ని సిఎం చెయ్..లేకపోతే ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశారు వైఎస్ షర్మిల. వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 2400KM మైలు రాయి దాటింది. కుల్చారం (మం) చిన్న ఘనపూర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా…ఇప్పుడు కేసీఅర్ అయినా స్వార్థ ప్రయోజనాల కోసమే పరిపాలన అని ఫైర్ అయ్యారు. మీ పాలన మీరు అద్బుతం అని మీరు అంటున్నారు.. మీ పాలన అద్బుతం అయితే నాతో ఒక్క రోజు పాదయాత్ర కి రండన్ కేసీఆర్ కు సవాల్ విసిరారు.

సమస్యలు ఉన్నాయని నేను చూపిస్తా నిజంగా సమస్యలు లేకుంటే నేను ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లి పోతా.. సమస్యలు ఉంటే..మీ ముక్కు నేలకు రాసి రాజీనామా చేయండని సవాల్ చేశారు. ఒక దళితుడిని ముఖ్యమంత్రి నీ చేయండి.. మీకు దమ్ము ఉంటే ఈ సవాల్ ను స్వీకరించండన్నారు.