భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కి ఇటీవల మరింత భద్రతని పెంచిన సంగతి తెలిసిందే.1+ 5/తో రోప్ పార్టీ ఏర్పాటు చేశారు అధికారులు.అదనంగా ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.బండి సంజయ్ కి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నివేదిక ఇవ్వడంతో భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.
ఇటీవల కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యల తర్వాత సంజయ్ కి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగా హెచ్చరించాయి.దీంతో బండి సంజయ్ కి భద్రతను పెంచారు.కానీ శుక్రవారం రోజు బండి సంజయ్ కి భద్రతను కుదించారు.భద్రతను పెంచిన రెండు రోజులకే ఇప్పుడు దానిని ఉపసంహరించుకోవడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడితోనే భద్రతను వాపస్ తీసుకున్నారని బండి సంజయ్ వర్గీయులు, పార్టీ నేతలు మండిపడుతున్నారు.