కాసేపట్లో డిజిపి ఆఫీసుకు కాంగ్రెస్ నేతలు

-

తెలంగాణ కాంగ్రెస్ సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు ప్రాంతమైన తుక్కుగూడలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. ఈ సభకి ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు ఒకే సభ పై ప్రత్యక్షం కానున్నారు. సుమారు పది లక్షల మంది కాంగ్రెస్ నేతలు ఈ మీటింగ్ కి హాజరుకానున్నారు.

ఈ సభలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ప్రకటించనున్నట్లు టిపిసిసి తెలిపింది. దీంతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ (సిడబ్ల్యూసి) తాజ్ కృష్ణ హోటల్ లో నిర్వహించనున్నారు. ఇందుకు సిడబ్ల్యుసి సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సీఎల్పీలు, పార్టీ అధ్యక్షులు, జాతీయస్థాయిలో కీలక నేతలు అందరూ హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం డిజిపి కార్యాలయానికి బయలుదేరారు. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై డిజిపి అంజనీ కుమార్ తో చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు ముఖ్య నేతలు బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version