గులాబీ వర్సెస్ కమలం: ఎవరి వర్షన్ వారిది?

-

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి…ఇప్పటివరకు రాజకీయంగానే టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ జరిగింది…ఇప్పుడు ఆ వార్ మరో స్థాయికి చేరుకుంది..అనూహ్యంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నంకు కుట్ర చేశారని చెప్పి కొందరిని పోలీసులు అదుపులో తీసుకోవడం…వారు కూడా హత్యాయత్నంకు కుట్ర పన్నినట్లు ఒప్పుకోవడం..పైగా కుట్ర చేసిన వారికి బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు సహకరించారని ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

అయితే ఇందులో తమకేమి సంబంధం లేదని అరుణ, జితేందర్‌లు చెబుతున్నారు…ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ అని, కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని వారు అంటున్నారు. ఇక శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యకు కుట్ర జరిగిందంటూ సీఎం కేసీఆర్‌ రూపొందించిన సినిమా అట్టర్‌ ఫ్టాప్‌ అయ్యిందని, ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా… కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైందని బండి సంజయ్‌ అంటున్నారు. ఈ విషయంలో కొందరు ఐ‌పి‌ఎస్‌లు రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇదే క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్లపై కూడా కొత్త చర్చ మొదలైంది. అయితే శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన రాఘవేంద్రరాజు… 2018 ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్‌ అఫిడవిట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అది దృష్టిలో పెట్టుకుని తనని శ్రీనివాస్ గౌడ్..అనేకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారని, అందూకే హత్యాయత్నం చేయడానికి చూసినట్లు రాఘవేంద్రరాజు చెప్పుకొస్తున్నారు.

అయితే దీనిపై టీఆర్ఎస్ నుంచి పెద్ద నేతలు స్పందించడం లేదు..కింది స్థాయి కార్యకర్తలు మాత్రం కాస్త రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి గిట్టని వ్యక్తులే హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఇటు శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం, మరో వైపు శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ల ఆరోపణలు..ఇలా టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news