రేషన్ కార్డు దారులకు షాక్.. ఇలా చేయకుంటే.. 4 రోజుల్లో రేషన్ కట్!

-

రేషన్‌ కార్డు దారులకు బిగ్‌ అలర్ట్‌. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 31 వరకు కేవైసీ చేసుకునేందుకు అవకాశం ఉంది. రేషన్ కార్డులో పేరు ఉన్నవారు దగ్గర్లోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి, వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది.

TS Government Implements Rigorous Measures for Ration Card E-KYC, Sets January 31 Deadline

జనవరి 31 లోగా కేవైసీ పూర్తి చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఇక అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version