సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం ఓ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ భారతమాల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం NHAI కి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్థంబాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గట్టు.. నిర్మాణాల కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థకి లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version