బీజేపీలోకి విజయశాంతి ? కీలక పదవి ఆఫర్ ?

-

తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్ కు గుడ్ బాయ్ చెప్పి కేంద్ర అధికార పార్టీ బిజెపిలో చేరబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ, ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారనే ప్రచారం  కొద్ది రోజులుగా సాగుతూ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే విజయశాంతి వ్యవహరిస్తూ వతున్నారు. ఇదే విషయమై తెలంగాణ పీసీసీ నాయకులు విజయశాంతి తో సంప్రదింపులు చేయగా, ఆ ఆఫర్ ను ఆమె నిరాకరించినట్లు స్వయంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో చెప్పినట్లు తెలుస్తోంది. దుబ్బాక నుంచి పోటీ చేసేందుకు విజయశాంతి ఆసక్తి చూపకపోవడంతో ఆ స్థానం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని బరిలోకి దింపాలని చూస్తున్నారట.

విజయశాంతి అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి గతంలో ఆమె బిజెపి లోనే ఉండేవారు. పార్టీలో ఉండగా ఆమెకు ప్రాధాన్యం బాగానే ఉండేది. కానీ ఆ తరువాత అటు నుంచి ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లడంతో ఆమె ప్రభావం బాగా తగ్గిపోయింది. అయితే తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి చాలా కాలంగా బలమైన నాయకుల కోసం వెతుకుతోంది. విజయశాంతిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా మరింతగా బల పడవచ్చని, అలాగే సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే విషయంలో విజయశాంతి దూకుడుగా వ్యవహరిస్తుంది అని, ఇది తమకు బాగా కలిసి వస్తుందని బిజెపి నాయకులు, ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు అంతగా ఆసక్తి చూపిస్తున్నారట.

ఈ మేరకు ఆమె పార్టీలో చేరితే, రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూడా బిజెపి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు విజయశాంతి కాంగ్రెస్ లోనే ఉన్నా, చాలా కాలంగా యాక్టివ్ గా లేరు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారానే స్పందిస్తూ వస్తున్నారు. ఇక ఆ తర్వాత ఆమె ఎక్కువగా సినిమాల వైపు మొగ్గుచూపారు. కానీ కొద్ది రోజులుగా మళ్ళీ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక ఇప్పుడు బిజెపి నుంచి వచ్చిన ఆఫర్ పై ఇప్పుడు విజయశాంతి ఏ విధంగా స్పందిస్తారో అనే విషయంపైనే తెలంగాణ రాజకీయ సమీకరణాలు ముడిపడి ఉంటాయి. అసలు ఈ విషయంలో కాంగ్రెస్ లో ఎంతటి కల్లోలానికి కారణం అవుతుందో…?

-Surya

Read more RELATED
Recommended to you

Latest news