ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నేతలు. కోమటిరెడ్డితో కేక్ కట్ చేయించి.. సంబురాలు జరుపుకున్నారు. అనంతరం సీఎం.. సీఎం నినాదాలతో హోరెత్తించారు కార్యకర్తలు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తనను అందరూ సీఎం అనొద్దని.. గతంలో మంత్రి పదవిని వదిలేసిన తనకు ఏ పదవి ముఖ్యం కాదని అన్నారు.
తనకు ప్రజలే ముఖ్యం అని, ప్రజల కోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక జూన్ మొదటి వారంలో ప్రియాంక గాంధీని నల్గొండ జిల్లాకు తీసుకువస్తామని.. నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. తాను సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.