ధమాకా చిత్రం నుంచి డిలీట్ సీన్ వీడియో వైరల్..!!

-

మాస్ హీరో రవితేజ , హీరోయిన్ శ్రిలిల కలిసి జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 23న విడుదలై కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రవితేజ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. మొదటిరోజు ఈ షోకు డివైడ్ టాక్ వినిపించిన ఆ తర్వాత కలెక్షన్ల పరంగా భారీగా పెరగడంతో బాక్సాఫీస్ వద్ద ధమాకా సినిమా హంగామా మొదలు కావడంతో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.

ధమాకా అందించిన సక్సెస్ తో హీరోయిన్ శ్రీ లీలకు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా బుధవారం నుంచి సారధి స్టూడియోలో మొదలు కాబోతున్నట్లు సమాచారం. ధమాకా సినిమా నుంచి ఇప్పటివరకు డిలీట్ చేసిన వీడియోలను సైతం విడుదల చేస్తూ వచ్చింది చిత్ర బృందం. తాజాగా నిన్నటి రోజున ఆరవ సీన్లకు సంబంధించి ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది.

ఈ సినిమాలో రవితేజ ఒక్కడే ఇద్దరు గా నటించారు. అయితే ఇద్దరినీ ఇష్టపడే పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమా నుంచి తొలగించిన ఆరవ సీన్ డిలీట్ చేసిన వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్న రవితేజ తనని పట్టించుకోవడంలేదని నేరుగా ఆఫీసుకి వెళ్లిలా అక్కడ రచ్చ రచ్చ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. రవితేజ శ్రీ లీల మధ్య జరిగే ఈ వీడియో బాగా ఆకట్టుకుంటోంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version