ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు ఆర్థిక భారం కాకూడదని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది.ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున శాసన సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటుు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సోమవారం మాసబ్ ట్యాంక్ లోని తన ఆఫీసులో మన భస్తి- మన బడి కార్యక్రమం అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ నెల9 న హైదరాబాద్ జిల్లాల్లొని ప్రతి నియోజకవర్గానికి మనబస్తి -మనబడి కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.ఈ సమావేశంలో హోం మంత్రి, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతి అభ్యర్థికి నెలకు రూ.5 వేలు అందిస్తామని తలసాని తెలిపారు.ఒక్కో బ్యాచ్ కు 100 మంది చొప్పున మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.